యువకులలో అత్యాధునిక ఆలోచనలను అందించడం అనేది ఊహ , నిర్ణయాత్మక తార్కికం మరియు దీర్ఘకాల అభ్యాసాన్ని ప్రోత్సహించడంలో ప్రాథమిక భాగం . సంరక్షకులుగా , బోధకులుగా మరియు తల్లిదండ్రుల వ్యక్తులుగా , దర్యాప్తు , అభ్యాసం మరియు అభివృద్ధికి బహిరంగ తలుపులు ఇవ్వడం ద్వారా యవ్వన వ్యక్తులను లోతుగా ప్రభావితం చేయడం మా బాధ్యత . పిల్లలలో కొత్త ఆలోచనలు మరియు ఆలోచనలను అందించగల సామర్థ్యం ఆచార విద్యను దాటిపోయింది ; దీనికి ఆసక్తి , నిబద్ధత మరియు విమర్శనాత్మక ఆలోచనా సామర్థ్యాలను మెరుగుపరిచే వాతావరణం అవసరం . ఈ కథనం సంరక్షకులు మరియు ఉపాధ్యాయులు నిజంగా పిల్లలలో సంచలనాత్మక ఆలోచనలను ప్రేరేపించడంలో సహాయపడే విధానాలు మరియు వ్యూహాలలోకి ప్రవేశిస్తుంది , స్థిరంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో వారు అభివృద్ధి చెందడానికి హామీ ఇస్తారు . మెరుగైన అభ్యాస వాతావరణాన్ని ఏర్పాటు చేయడం పిల్లల మానసిక పురోగతికి మెరుగైన వాతావరణం ముఖ్యమైనది . పిల్లలను ఉత్తేజపరిచే మరియు వివిధ పరిస్థితులకు అందించిన వారు ఆలోచించే మరియు కనిపెట్టే తార్కిక సామర్థ్...
పిల్లలు ఎంతో సంతోషంగా అన్ని విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తిని కలిగి ఉంటారు . అలాంటి సమయంలో పిల్లలకు తగిన విధంగా తల్లిదండ్రులు ఎలా చెప్పాలో ముందు మనం నేర్చుకోవాలి . పిల్లలు పాఠశాలలో చేరకముందే తోటి పిల్లలను చూసి అనేక రకాలైన ప్రశ్నలు వేస్తారు . వాళ్ళు అడిగే ప్రశ్నలకు చాల సున్నితంగా మనం సమాధానం చెప్పాలి . పిల్లలు అడిగే ప్రశ్నలలో ఎంతో అంతరార్థం దాగి ఉంటుంది.వాళ్ళు ఎదో నేర్చుకోవాలనే ఉత్సాహం కలిగి ఉంటారు .
పిల్లల మధ్య ఎన్నో తేడాలు ఉంటాయి.
ఒకే వయసు కలిగిన పిల్లల మధ్య , ఇతర ప్రాంతాలలో పెరిగిన పిల్లల మధ్య, రకరకాల పరిస్థితులలో పెరిగిన పిల్లలలో ఎన్నో తేడాలు ఉంటాయి . కొంత మంది పిల్లలు అన్నింటిలో చురుగ్గా ఉంటారు , మరికొంతమంది పిల్లలు మౌనంగా ఉంటారు . ఒకే తరగతిలో విభిన్న బేధాలు ఉన్నటువంటి పిల్లలు ఎంతో మంది ఉంటారు. కొంతమంది పిల్లలు అందరితో కలిసి బాగా మాట్లాడగలరు, మరికొందరు మాట్లాడాలంటేనే బయపడుతారు.
పిల్లలకు ఇష్టమైన వాటి గురించి చెప్పాలి.
పిల్లల వయస్సు కి తగ్గట్టు ఇష్టాలు ఉంటాయి. వాటిని మనమే తెలుసుకొని వాటి గురించి స్పష్టంగా వారికీ అర్థమయ్యే రీతిలో చెప్పాలి. కొంతమంది పిల్లలకు ఆటలంటే బాగా ఇష్టం అలాంటి వారికి ఆటల పై మక్కువ కలింగించే విషయాలు గురించి చెప్పాలి. మరికొందరికి పాటలు, బొమ్మలు, రాయడం, చదవడం, ఇలా పిల్లలకు ఇష్టమైన వాటి గురించి చెప్పి ప్రోత్సహించాలి.
పిల్లలు నేర్చుకొనే విధానం తల్లిదండ్రుల పై ఆధారపడి ఉంటుంది.
పిల్లల్లో గ్రహించే శక్తి ఎక్కువుగా ఉంటుంది. వారు ఎక్కువ విషయాలు ఇతరులు నుంచే నేర్చుకుంటారు. చిన్న వయస్సులో పిల్లలు ఎక్కువగా ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇంట్లో ఉండే పెద్దలు, తల్లిదండ్రులు మంచి పదజాలముతో, ప్రవర్తన తో ఉండడం ఉత్తమం.పిల్లల మనసుకు దగ్గరగా చేరి వారికి ఆట పాటలతో కొన్ని కొత్త విషయాలు నేర్పించాలి. కొంతమంది పిల్లలు పెద్దలు చేసే పనులు చూసి నేర్చుంటారు. తల్లిదండ్రులు చేసే ప్రతి పనిలోనూ పిల్లలకు ఆదర్శవంతులుగా ఉండాలి. అప్పుడే పిల్లలు పెద్దలను చూసి మంచి విషయాలు గ్రహించి నేర్చుకుంటారు. తల్లిదండ్రులు చేసే వృత్తినే పిల్లలు కూడా వారిలాగే యాక్షన్ చేస్తూ ఉంటారు. ఈ ఒక్క విషయంలోనే కాదు ప్రతి విషయంలో కూడా పిల్లలు పెద్దలను చూసి ఎన్నో విషయాలను నేర్చుకుంటారు.
పిల్లలు చెప్పే వాటిని శ్రద్ధగా వినాలి.
ప్రతి ఒక్క కుటుంబంలో చిన్న పిల్లలు ఉంటారు. వారు చెప్పే విషయాలను మనము విని వినకుండా వదిలేస్తూ ఉంటాము ఈ బిజీ లైఫ్ లో పిల్లలు ఏం చెప్తున్నారో వినకుండా లైట్ గా తీసుకుంటాంరు. ఆ సందర్భంలో పిల్లలు ఏం చెప్తున్నారు వినకపోతే పిల్లలు యొక్క మనసు నిరుత్సాహపడుతుంది. ఎప్పుడైతే పిల్లల చెప్పే విషయాలను మనము శ్రద్ధగా వింటామో.... పిల్లలకి తల్లిదండ్రులకు మధ్య బంధం బలపడుతుంది. చిన్నప్పుడు నుంచి పిల్లలు చెప్పే విషయాలను మనం శ్రద్ధగా వినడం వలన వారు బహిర్గతంగా అనర్గళంగా స్వేచ్ఛగా వారి భావాలను వ్యక్తపరచగలరు.
పిల్లలకు బయట ప్రదేశాలను చూపించాలి.
పిల్లలు ఇంట్లో కొంత జ్ఞానాన్ని పొందుతారు కానీ పిల్లలని బయట ప్రదేశాలకు తీసుకోని వెళ్లడం వలన అక్కడ ఎక్కువ పరిసర జ్ఞానాన్ని పొందుతారు. బయట పరిసరాలలో ఉండే వస్తువులు, మనుషులు,జంతువుల, పక్షులు ద్వారా ఎంతో అనుభవ జ్ఞానాన్ని పొందుతారు. ఉదాహరణకు ప్రతి వారము పిల్లలని పార్కుకి తీసుకు వెళ్లడం వలన అక్కడ వారు కొన్ని విషయాలను పరిశీలించి మనలని కొన్ని ప్రశ్నలను అడుగుతారు. ఇలా ప్రశ్నలు అడగడం వలన వారిలో ప్రశ్నించే తత్వము మరియు పరిశీలన శక్తి పెంపొందుతాయి. దీని ద్వారా పిల్లలు మేధో శక్తి పరిణతి చెందుతుంది.
కథలు చదివి వినిపించాలి.
పిల్లల కోసం కొంత సమయాన్ని కేటాయించాలి. ఆ సమయంలో పిల్లలకి కొన్ని కథలను కొత్త కొత్త విషయాలను చెప్పాలి. కొన్ని బొమ్మలతో కూడిన కథలను పిల్లలకి చదివి వినిపించడం వలన ఆ కథలో ఉండే పాత్రలలో వారిని ఊహించుకునే ఊహ శక్తి అభివృద్ధి చెందుతుంది. ఇలా కథలో చెప్పడం వలన పిల్లలు సొంత మాటల్లో కొన్ని కథలను ఊహించుకొని చెప్పగలరు. ఈ విధంగా ప్రతిరోజు ఏదో ఒక రకమైన కథ చెప్పడం వలన పిల్లలు కొన్ని రోజులకు వాళ్లే కథలు చదివే విధంగా అలవాటు పడతారు.
పిల్లల భావాలకు అవకాశం ఇవ్వాలి.
పిల్లలు కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని రకమైన భావాలను వ్యక్తపరుస్తుంటారు. అలాంటి వాటిని మనము గుర్తించి పిల్లలు స్వేచ్ఛగా వ్యక్తపరిచే విధంగా వాళ్లకు అవకాశం కల్పించాలి. బాధలో కోపాన్ని నవ్వులో సంతోషాన్ని ఆందోళనలో భయాన్ని ఇలా అనేక రకాలైన భావాలను వ్యక్తపరుస్తుంటారు. వాళ్ల భావాలకు అనుకూలంగా ప్రతిస్పందించి తగిన ప్రోత్సాహం ఇవ్వడం వలన ఏదైనా చెప్పగలం మరియు చేయగలం అనే ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. ఏదైనా ప్రతికూల మరియు అనుకూల పరిస్థితులలో స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునేటువంటి అలవాటుని వారు నేర్చుకుంటారు.
చదవడం నేర్పించాలి.
ఇంట్లో ఉండే తల్లిదండ్రులు ఏదో ఒక విషయం గురించి కథలో చెప్పడం లేదా చదవడం వలన పిల్లలు కూడా వాళ్ళని అనుకరిస్తూ చదవడం చేస్తూ ఉంటారు. ఇలా ప్రతిరోజు చేయడం వలన చదవడం అనేది వారికి ప్రతిరోజు ఒక కృత్యంగా మారుతుంది.ఎప్పుడైతే పిల్లలు పుస్తకము లేదా పేపర్ చదవడం ప్రారంభిస్తారో అందులో ఉండేటువంటి జ్ఞానాన్ని పొందుతాడు.
ముగింపు.
చివరిగా ఒక మాట....... పిల్లల యొక్క మేధాశక్తిని పెంచడంలో పై విషయాలు మీకు ఉపయోగకరంగా ఉన్నాయని అనుకుంటాను. ఇవే కాకుండా మీ పిల్లల విషయంలో ఇంకా ఎన్నో విషయాలను తెలుసుకుని వారి యొక్క మేధాశక్తిని పెంపొందించడంలో మీరు ముందుండాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషిని......
మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కింది కామెంట్ ద్వారా తెలియజేయాలని కోరుకుంటున్నాను.

.jpeg)
Comments
Post a Comment